బర్త్ సిటిజన్​షిప్​పై సుప్రీంకు ట్రంప్

బర్త్ సిటిజన్​షిప్​పై సుప్రీంకు ట్రంప్

వాషింగ్టన్: జన్మత: పౌరసత్వం రద్దుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  సుప్రీంకోర్టును ఆదేశించారు. జన్మత: పౌరసత్వం రద్దుపై తాను జారీచేసిన ఎగ్జిక్యూటివ్  ఆర్డర్లకు వ్యతిరేకంగా వాషింగ్టన్, మసాచుసెట్స్, మేరీల్యాండ్  రాష్ట్రాల్లో  ఫెడరల్  కోర్టులు ఇచ్చిన ఆదేశాలను(ఇంజక్షన్లు) సుప్రీంకోర్టులో ట్రంప్  పాలకవర్గం సవాలు చేసింది. పిటిషన్లు వేసిన రాష్ట్రాలకే ఫెడరల్  కోర్టులు ఇచ్చిన ఆదేశాలు వర్తించేలా చూడాలని, దేశమంతా ఫెడరల్  కోర్టుల ఆదేశాలు అమల్లోకి రాకుండా చూడాలని కోరుతూ న్యాయశాఖ సుప్రీంకోర్టులో పిటిషన్  వేసింది. ప్రస్తుత సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూనివర్సల్  ఇంజక్షన్లు తార స్థాయికి చేరాయని తెలిపింది. మాజీ అధ్యక్షుల వివిధ పాలసీలను అడ్డుకుంటూ కొన్ని ఫెడరల్  కోర్టులు దేశవ్యాప్తంగా ఆదేశాలు జారీ చేశాయని గుర్తుచేసింది.