అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవి భాగానికి గాయమవ్వగా, ఒకరు మృతి చెందారు. కాగా, కాల్పుల తర్వాత తొలిసారి ట్రంప్ స్పందించారు. ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో ఎదో శబ్దంతో చెవిపై దూసుకుపోయినట్లు అర్థమైందని అన్నారు. రక్తస్రావం జరగటంతో ఆ తర్వాత ఏమైందో గ్రహించినట్లు తెలిపారు ట్రంప్.
వెంటనే అప్రమత్తమై మోకాళ్లపై కుర్చున్నానని, దేశంలో ఇలాంటి ఘటన జరగటం నమ్మశక్యంగా లేదని అన్నారు ట్రంప్.అయితే, ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడ్డ దుండగుడిని ట్రంప్ భద్రతా సిబ్బంది కాల్చి చంపారు.