అమెరికా సరిహద్దుల్లోకి బలగాలు : ట్రంప్ యాక్షన్ మొదలైపోయింది..

అమెరికా సరిహద్దుల్లోకి బలగాలు : ట్రంప్ యాక్షన్ మొదలైపోయింది..

యూఎస్ 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ తన యాక్షన్ ప్లాన్ అమలు చేయడం ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం పూర్తైన ఆరు గంటల్లోనే దాదాపు 80 ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్స్ పైన సంతకాలు చేశారు. ట్రంప్ ఆర్డర్స్ లో ముఖ్యమైనది మెక్సికో బార్డర్స్ లో ఎమర్జెన్సీ విధించడం. ఇల్లీగల్ గా ప్రవేశించే ఇతర దేశాల పౌరునలు, నేరస్తులను వెంటనే అడ్డుకోవడంతోపాటు.. మిలియన్ల కొద్దీ యూఎస్ లో ఉన్న అక్రమ వలసదారులను వెనక్కి పంపించనున్నట్లు ప్రకటించారు. బార్డర్ లో అత్యవసరంగా బలగాలను మోహరించాలని ఆదేశించారు. 

రెండవ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. తొలి రోజు తన ముఖ్యమైన పని గత ప్రభుత్వం జారీ చేసిన విధ్వసంక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను రద్దు చేయడమేనని ప్రకటించారు. ప్రసిడెన్షియల్ పెరేడ్ తర్వాత వైట్ హౌజ్ కు చేరుకున్న వెంటనే ఆర్డర్స్ పైన సంతకాలు చేశారు. 

 పారిస్ వాతావరణ ఒప్పందం-2021 నుంచి వైదొలుగుతున్న మరో ఆర్డర్ పై సంతకం చేశారు. సంప్రదాయ ఇంధన వనరుల వినియోగానికి ఊతం ఇస్తూ, పర్యావరణ నిబంధనలను సవరించనున్నారు. అదేవిధంగా న్యూ గ్రీన్ పాలసీకి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు.

యూఎస్ ఫెడరల్ ఎంప్లాయిస్ కు సంబంధించిన మరో ఫైలుపై ప్రాధాన్యత క్రమంలో సంతకం చేశారు. ఉద్యోగుల వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని రద్దు చేశారు. ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వెంటనే ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని వైట్ హౌస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ (భావ వ్యక్తీకరణ) ను పునరుద్ధరిస్తూ.. సెన్షార్ షిప్ కు ముగింపు పలికే ఆర్డర్ ను ఆమోదించారు. జో బైడెన్ హయాంలో ప్రతిపక్ష పార్టీలు, పౌరుల భావ వ్యక్తీకరణను అణచి వేశారనే ఆరోపణలతో ట్రంప్ ఈ ఆర్డర్ కు ప్రాధాన్యతనిచ్చారు. 

ALSO READ : మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంట.. వాళ్లను వెనక్కి పంపిస్త: ట్రంప్

గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచి.. ట్రంప్ ఓటమి తర్వాత ఆయన మద్ధతు దారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. 2021 జనవరి 6న జరిగిన అల్లర్లలో నిందులైన దాదాపు1500 మందికి ట్రంప్ తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి క్షమాభిక్ష ప్రసాదించారు.

ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్ అంటే..

అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం అధ్యక్షుడికి ఉన్న విశేష నిర్ణయాధికారమే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్..  చట్ట సభల అనుమతితో పనిలేకుండా అమలు చేయడమే దీని ప్రత్యేకత. చట్ట సభ్యులు ఒప్పుకోరని భావించే నిర్ణయాలను ప్రెసిడెంట్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పాస్ చేస్తారు. పాత అధ్యక్షుడు దిగిపోతూ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయడానికీ ఇది వీలు కల్పిస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను రద్దు చేయాలంటే చట్ట సభ్యులు ప్రత్యేక తీర్మానం చేయాల్సిందే. ఇలా చేసిన తీర్మానాన్ని వీటో చేసే అధికారాన్ని రాజ్యాంగం తిరిగి ప్రెసిడెంట్​ చేతుల్లోనే పెట్టింది.