అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ బరిలోకి దిగారు. ఇందులో భాగంగా కమలా హారిస్‌తో ముఖాముఖి చర్చకు ట్రంప్ ఓకే చెప్పారు. సెప్టెంబర్ 4న కమలా హారిస్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్‌నిర్వహించాలని ఫాక్స్ న్యూస్ చేసిన ప్రతిపాదనకు ట్రంప్ అంగీకరించారు.
ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్ 4 బుధవారం కమలా హారిస్‌తో డిబేట్ చేయడానికి ఫాక్స్ న్యూస్ చేసిన ప్రతిపాదనకు అంగీకరించానన్నారు. గతంలో ఏబీసీలో బైడెన్‌తో చర్చ జరగ్గా ఆ డిబేట్ లో ట్రంప్ పైచేయి సాధించడంతో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. మరోవైపు డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ కూడా ట్రంప్‌తో డిబేట్ కు సిద్ధమంటూ ప్రకటించారు. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.