
Trump On Inflation: ఒకపక్క నేడు ప్రపంచ మార్కెట్లలో దిగజారిన పరిస్థితులు కోట్ల మంది ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేస్తుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో అసలు ద్రవ్యోల్బణం లేదని బల్లగుద్ది చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కీలక మార్కెట్లు పతనం అయినప్పటికీ తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ క్రమంలో ట్రంప్ గత అమెరికా పాలకులపై తీవ్రంగా స్పందిస్తూ వారు చేసిన ఎకనమిక్ పాలసీదే ప్రపంచ దేశాలకు అనుకూలంగా మారాయన్నారు. ప్రధానంగా చైనా అమెరికా ఆర్థిక వనరులను లూటీ చేయటానికి గత పాలకుల తప్పుడు పాలసీలే కారణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ల పతనంపై ఆయన స్పందిస్తూ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయని, వడ్డీ రేట్లు కూడా తగ్గుతున్నాయని, ఆహార ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. ఇలా అన్నీ అదుపులో ఉన్నప్పుడు అసలు ద్రవ్యోల్బణం ఎక్కడిదంటూ వ్యాఖ్యానించారు.
Also Read : 14దేశాల వీసాల బ్యాన్..లిస్టులో ఇండియా
తాను ప్రకటించిన సుంకాలు చాలా కాలంగా దుర్వినియోగానికి పాల్పడిన ప్రపంచ దేశాల నుంచి వారానికి బిలియన్ల డాలర్లను ప్రస్తుతం అమెరికాకు తీసుకొస్తోందన్నారు. అలాగే చైనా ప్రతీకార సుంకాలను ప్రకటించి తమ హెచ్చరికలను విస్మరించిదంని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిపెద్ద దుర్వినియోగదారుడిగా ఉన్న చైనా తన హెచ్చరికలను అంగీకరించ కుండా హాస్యాస్పదంగా అమెరికాపై ప్రతీకార సుంకాలను ప్రకటించిందని ట్రంప్ అన్నారు. అనేక దశాబ్ధాలుగా చైనా దుర్వినియోగానికి పాల్పడిందంటూ గత పాలకుల నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు.