చైనాతో చర్చలు జరుపుతున్నాం..మంచి డీల్ చేసుకోబోతున్నాం:డొనాల్డ్ ట్రంప్

చైనాతో చర్చలు జరుపుతున్నాం..మంచి డీల్ చేసుకోబోతున్నాం:డొనాల్డ్ ట్రంప్

అమెరికా, చైనా మధ్య టారీఫ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక అమెరికా పెద్దన్న పాత్రను నిలబెట్టుకోవాలని చేస్తున్న సంస్కరణల్లో టారీఫ్ ఒకటి. ఈ క్రమంలో ప్రపంచదేశాలపై టారీఫ్ పెంచుతూ వస్తున్నారు. చైనాపై కూడా టారీఫ్ పెంచారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్న అమెరికా, చైనాల మధ్య టారీఫ్ వార్ జరుగుతున్న క్రమంలో  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. 

టారీఫ్ వార్ ముదురుతున్న క్రమంలో చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలు జరుపుతున్నాం.. త్వరలో మంచి డీల్ చేసుకోబోతున్నాం అని ట్రంప్ తెలిపారు. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోనితో సమావేశం సందర్భంగా ట్రంప్ విలేకరులకు ఈ విషయాన్ని వెల్లడించారు. 
చైనా వస్తువులపై సుంకాలను 145 శాతానికి పెంచిన తర్వాత నుంచి చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. చైనా కూడా దిగుమతి ధీటుగా సుంకాలు పెంచింది. అమెరికా, చైనా మధ్య టారీఫ్ వార్ ముదురుతున్న క్రమంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అమెరికా, చైనా ఇప్పటికీ పరస్పరం టారిఫ్ యుద్దం  ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. అమెరికాతోపాటు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోనితో వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ ఆశాజనక స్వరం వినిపించారు.  " చైనాతో మంచి ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ప్రకటించారు. ఈ సమావేశంలో యూరోపియన్ యూనియన్‌పై అమెరికా టారిఫ్‌ల వివాదం పరిష్కరించడం పై కూడా చర్చలు జరిపారు.