చైనాకు షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్ 20 శాతానికి పెంపు

చైనాకు షాకిచ్చిన డొనాల్డ్  ట్రంప్.. టారిఫ్ 20 శాతానికి పెంపు

 రోజుకో  సంచలన నిర్ణయంతో  అమెరికా  అధ్యక్షుడు   డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి దేశాలను హడలెత్తిస్తున్నారు.  లేటెస్ట్ గా   టారీఫ్ ల విషయంలో చైనాకు షాకిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే ఆ దేశ ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు ఉండగా..ఇపుడు దానిని 20 శాతానికి పెంచారు. ఈ నిర్ణయానికి సంబంధించిన  కార్యనిర్వాహక ఉత్తర్వలపై  ట్రంప్ సంతకం చేశారు. 

 ఫెంటనిల్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో బీజింగ్‌ విఫలమయ్యిందని.. అందుకే  చైనా టారిఫ్ లను రెట్టింపు చేస్తున్నట్లు  ట్రంప్ వెల్లడించారు.  మరో వైపు కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం టారిఫ్ ల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ తెలిపారు. మార్చి 4 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. 

Also Read:-ఉక్రెయిన్కు షాకిచ్చిన ట్రంప్.. సైనిక సాయం బంద్..

అమెరికా దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ  ప్రతిజ్ఞ చేసింది. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చైనా కోరింది.  కెనడా  ప్రధాని ట్రూడో కూడా అమెరికాపై ప్రతీకార టారిఫ్ విధించారు. అమెరికా నుంచి  దిగుమతి చేసే ఆల్కహాల్ పండ్లు, ఇతర వాణిజ్య ఉత్పత్తులపై  25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు తెలిపారు. 107 బిలయన్ డాలర్ల ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు   చెప్పారు. 

మరో వైపు ట్రంప్ నిర్ణయాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. డోజోన్స్‌ 1.48శాతం, ఎస్‌అండ్‌పీ సూచీ 1.76 శాతం, నాస్‌డాక్‌ 2.64 శాతం  నష్టపోయాయి. ఈ ప్రభావం,ఆసియా,ఆస్ట్రేలియా మార్కెట్లపైన కూడా ప్రభావం చూపింది.