33 వేలకు బ్రాండెడ్ బూట్లు అమ్మిన ట్రంప్

ఫిలడెల్ఫియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్  పార్టీ తరపున పోటీచేయనున్న మాజీ ప్రెసిడెంట్  డొనాల్డ్  ట్రంప్  బ్రాండెడ్  బూట్లు అమ్మారు. ఫెలడెల్ఫియా సిటీలోని ‘స్నీకర్  కాన్’ లో ట్రంప్ బ్రాండెడ్  షూస్ ను ఆయన విక్రయించారు. బూట్లను అమ్మేందుకు వచ్చిన ట్రంప్ కు ఆయన అభిమానులు, మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. బూట్లు బంగారు రంగులో ఉన్నాయి. వెనుక భాగంలో అమెరికా జెండా ఉంది. ఓ వెబ్ సైట్ లో ఆ బూట్లను 399 అమెరికన్  డాలర్లకు (రూ.33 వేలు) విక్రయిస్తున్నారు.