ట్రంప్ టారిఫ్‌‌‌‌‌‌‌‌లు.. ఐటీ షేర్లు డమాల్‌‌‌‌‌‌‌‌.. ఆటో కంపెనీలకు నష్టమే

ట్రంప్ టారిఫ్‌‌‌‌‌‌‌‌లు.. ఐటీ షేర్లు డమాల్‌‌‌‌‌‌‌‌.. ఆటో కంపెనీలకు నష్టమే

ముంబై:  అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్‌‌‌‌‌‌‌‌ సహా దాదాపు 60 దేశాలపై ప్రతీకార సుంకాలు వేయడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటే  ఇండియన్ స్టాక్ మార్కెట్ గురువారం (April 3) నష్టాల్లో  ట్రేడయ్యింది. ముఖ్యంగా  ఐటీ, ఆటో షేర్లు  పతనమయ్యాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్, ఫార్మా షేర్లు లాభాల్లో కదలడంతో ఇంట్రాడే నష్టాల నుంచి  బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు కోలుకోగలిగాయి.  

ట్రంప్ టారిఫ్‌‌‌‌‌‌‌‌ల ప్రభావం ఇండియన్ మార్కెట్లపై పెద్దగా పడలేదు. మొత్తం 2,963 షేర్లు గురువారం ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈలో  ట్రేడవ్వగా, ఇందులో 2,057 షేర్లు లాభాల్లో ముగిశాయి. 829 షేర్లు మాత్రమే నష్టపోయాయి.    సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌  322 పాయింట్లు (0.42 శాతం) తగ్గి 76,295.36 వద్ద ముగిసింది. సెషన్‌‌‌‌‌‌‌‌లో 810  పాయింట్లు (1.05 శాతం) పతనమై 75,807.55 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది.  

నిఫ్టీ ఇంట్రాడేలో 187 పాయింట్లు (0.79 శాతం) తగ్గగా, చివరికి  82.25 పాయింట్లు (0.35 శాతం) నష్టంతో 23,250.10 వద్ద స్థిరపడింది.  ట్రంప్ దాదాపు 60 దేశాలపై  ప్రతీకార సుంకాలు వేయగా,  భారతీయ వస్తువులపై 27 శాతం సుంకం విధించారు.  అన్ని దేశాలపై కనీసం 10 శాతం టారిఫ్ వేశారు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ గురువారం 4 శాతానికి పైగా పతనమైంది.  టీసీఎస్‌‌‌‌‌‌‌‌ షేర్లు 3.98 శాతం, హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్నాలజీస్ 3.71 శాతం, టెక్ మహీంద్రా 3.79 శాతం, ఇన్ఫోసిస్ 3.41 శాతం క్షీణించాయి. 

టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్‌‌‌‌‌‌‌‌ మహీంద్రా,  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, మారుతి సుజుకి, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.  మరోవైపు పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రిడ్, సన్ ఫార్మాస్యూటికల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, టైటాన్, ఇండస్‌‌‌‌‌‌‌‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.  "టారిఫ్‌‌లతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌, అమెరికా జీడీపీ వృద్ధి మందగించొచ్చు. అలానే  అమెరికా ద్రవ్యోల్బణం  పెరగొచ్చు. ట్రంప్ టారిఫ్‌‌‌‌‌‌‌‌లు ఇండియాలోని కొన్ని రంగాలపై నెగెటివ్ ప్రభావం చూపుతాయి’’ అని ఎనలిస్టులు చెబుతున్నారు.