ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్(ఐఎస్ఎస్) నుంచి నాసా ఆస్ట్రోనాట్స్సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను సురక్షితంగా భూమిపైకి తీసుకురా వాలని స్పేస్ ఎక్స్ సంస్థను డొనాల్డ్ ట్రంప్ కోరారు. వారిని జో బైడెన్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఈమేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. ‘‘బైడెన్ సర్కారు నిర్లక్ష్యంతో ఐఎస్ఎస్లోనే ఉండిపోయిన ఇద్దరు ధైర్యవంతులైన వ్యోమగాములను భూమికి తీసుకురండి” అని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌ను కోరినట్టు చెప్పారు.
‘‘వారు స్పేస్ స్టేషన్లో నెలలుగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఎలాన్ వారిని తీసుకొస్తాడు. అందరూ సేఫ్‌గా ఉంటారని ఆశిస్తున్నా. గుడ్‌లక్ ఎలాన్” అని పోస్ట్ పెట్టారు. కాగా, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను సురక్షితంగా భూమిపైకి తీసుకురావాలని ట్రంప్ కోరారని ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు.