ఆ దేశం నుంచి ఆయిల్ కొంటే 25% టారిఫ్.. ట్రంప్ తాజా హెచ్చరిక.. ఇండియన్ కంపెనీలపై తీవ్ర ప్రభావం

ఆ దేశం నుంచి ఆయిల్ కొంటే 25% టారిఫ్.. ట్రంప్ తాజా హెచ్చరిక.. ఇండియన్ కంపెనీలపై తీవ్ర ప్రభావం

యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై గట్టి దెబ్బ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నారు. పదే పదే ఇండియా తమపై టారిఫ్ లు ఎక్కువగా విధిస్తోందని విమర్శిస్తూ వస్తున్న ట్రంప్.. ఇండియాపైన కూడా టారిఫ్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. అంటే ఇండియా ఎంత పన్ను విధిస్తే యూఎస్ కూడా అంతే పన్నులు విధిస్తుందని హెచ్చరించారు. తాజాగా ఇండియాను పరోక్షంగా దెబ్బ కొట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.

వెనుజులా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే కంపెనీలపై 25 శాతం టారిఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ టారిఫ్ లు ఏప్రిల్ 2 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపారు. వెనుజులా తమ దేశానికి అక్రమ వలసాదారులను, క్రిమినల్స్ ను పంపిస్తోందని, ఆ దేశానికి బుద్ధి చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వెనుజులా నుంచి ఎవరు ఆయిల్ దిగుమతి చేసుకున్న పన్నుపోటు తప్పదని హెచ్చరించారు.

ALSO READ | ట్రంప్ తో డిన్నర్ కి వెళ్లి ఎలాన్ మస్క్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్

 వెనుజులా దేశం నుంచి ఎక్కువ ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాలలో ఇండియా ఒకటి. భారత కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC), రిలయన్స్ (Reliance) కంపెనీలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. 2023 తర్వాత అమెరికా నిబంధనలను సడలీకరించడంతో రిలయన్స్ కంపెనీ ఈ మధ్యనే వెనుజులా నుంచి ఆయిల్ దిగుమతి తిరిగి ప్రారంభించింది. ట్రంప్ తాజా ప్రకటన ఈ కంపెనీలపై ప్రభావం చూపనుంది.