Trump Warning:చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..అలా చేస్తే అధిక సుంకం విధిస్తాం

Trump Warning:చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..అలా చేస్తే అధిక సుంకం విధిస్తాం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.34 శాతం సుంకం తగ్గించకపోతే మరోసారి చైనా వస్తువులపై భారీగా సుంకం పెంచుతామన్నారు. చైనా పెంచిన సుంకాలు ఏప్రిల్ 9నుంచి అమలులోకి రానున్న క్రమంలో ట్రంప్ అల్టీమేటం జారీ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ తన సోషల్ మీడియా బ్లాగ్లో ప్రకటించారు. సుంకాలు తగ్గించకపోతే ఇకపై మాటల్లేవ్..చర్యలే ఉంటాయన్నారు.   

ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికా, చైనా మధ్య ట్రేడింగ్ వార్ ముదురుతోంది. గతంలో చైనావస్తువులపై  25 శాతం సుంకం పెంచిన ట్రంప్ సర్కార్ మరోసారి పెంచేందుకు రెడీ అయింది. మొదటిసారి ట్రంప్ సుంకం పెంచిన తర్వాత చైనాకూడా ధీటుగా 46 శాతం సుంకం పెంచింది. అయితే దీనిపై గుర్రుగా ఉన్న ట్రంప్.. పెంచిన సుంకాన్ని తగ్గించకపోతే అదనంగా మరింత సుంకం పెంచేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. 

Also Read : అసలు ద్రవ్యోల్బణం లేదన్న ట్రంప్

ఈ పోస్టులో ట్రంప్ ఇతర దేశాలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏవైతే అమెరికాపై సుంకాలు విధించాయో ఆ దేశాలన్నీ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని.. లేకుండా మరోసారి సుంకం పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు. దశాబ్ధాలుగా చాలా దేశాలు ప్రత్యేకించి చైనా సుంకాల దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ట్రంప్ మరోసారి పోస్ట్ లోపేర్కొన్నారు.