
- దేశ ప్రయోజనాలు అతనికి పట్టవు: ట్రంప్ అడ్వైజర్ పీటర్ నవారో
- టారిఫ్‌లను వ్యతిరేకిస్తున్నారని ఫైర్
- పీటర్ మూర్ఖుడు అని ఎలాన్ మస్క్ ఆగ్రహం
వాషింగ్టన్: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్వార్థపరుడని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆరోపించాడు. మస్క్.. కారు తయారీదారుడు కాదని, కారు అసెంబ్లర్ అని విమర్శించాడు. ‘‘దేశ ప్రయోజనాలు ఎలాన్ మస్క్‌కు పట్టవు. అతనొక స్వార్థపరుడు. ఏ పనిచేసినా అందులో తనకెంత లాభం వస్తుందనే ఆలోచిస్తాడు. సొంత కంపెనీలకు నష్టం వస్తుందనే కారణంతో చైనాపై అమెరికా వేస్తున్న టారిఫ్‌లను వ్యతిరేకిస్తున్నాడు. దేశ అభివృద్ధి మస్క్‌కు అక్కర్లేదు. తన కంపెనీ మాత్రమే బాగుండాలని కోరుకునే స్వార్థపరుడు. డోజ్‌లో ఉన్నంత వరకు అతను బాగానే ఉన్నాడు. కానీ.. అసలు అక్కడ ఏం జరుగుతున్నదో మాకు మాత్రమే అర్థమవుతున్నది. టెస్లా వాహనాల విడిభాగాలను చైనా, జపాన్, తైవాన్, మెక్సికో వంటి దేశాల నుంచి తీసుకొస్తాడు. అమెరికాలోనే వీటి తయారీ గురించి మాత్రం ఆలోచించడు. టారిఫ్‌తో తాను నష్టపోతున్నాననే భయంలో ఉన్నాడు. అందుకే స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని కోరుకుంటున్నాడు’’ అని పీటర్ అన్నాడు. నవారో కామెంట్లపై మస్క్ ధీటుగా స్పందించాడు. నవారోను ఓ మూర్ఖుడు అని విమర్శించాడు. పీటర్ మానసిక పరిస్థితి బాగాలేదన్నాడు.