టారిఫ్లపై కాస్త తగ్గిన ట్రంప్ .. నెల రోజులు వాయిదా వేసేందుకు అంగీకారం

టారిఫ్లపై కాస్త తగ్గిన ట్రంప్ .. నెల రోజులు వాయిదా వేసేందుకు అంగీకారం

యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాస్త తగ్గారు. కెనడా, మెక్సికోలపై విధించిన టారిఫ్ లను నెల రోజుల పాటు వాయిదా వేసేందుకు అంగీకరించారు. దీంతో నార్త్ అమెరికాతో ట్రేడ్ వార్ కు కాస్త బ్రేక్ ఇచ్చినట్లయింది. టారిఫ్ లను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘‘మెక్సికో ప్రసిడెంట్ తో చర్చించాను. బోర్డర్ కు 10 వేల మంది సైన్యాన్ని పంపేందుకు అంగీకరించారు. యూఎస్ లోకి అక్రమ వలసలు, డ్రగ్స్ సరఫరాను సైనికులు అడ్డుకుంటారు. టారిఫ్ లను 30 రోజుల పాటు వాయిదా వేయాలని చర్చించాం’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. 

తాజా నిర్ణయంతో అమెరికా, కెనడా, మెక్సికో మధ్య ట్రేడ్ వార్ కు కాస్త బ్రేక్ పడనుంది. అయితే చైనాపై టారిఫ్ లు కొనసాగనున్నాయి. కెనడా, మెక్సికో దేశాలపై మాత్రమే పన్ను వాయిదాకు అంగీకరించారు. 

ట్రంప్ నిర్ణయంత తర్వాత కెనడా ప్రధాని ట్రూడో కూడా సుంకాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా 1.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి బార్డర్ సెక్యూరిటీని పెంచే ప్లాన్ లో ఉన్నట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇక మెక్సికో ప్రసిడెంట్ షేన్ బామ్ కూడా 10 వేల మంది సైనికులను బార్డర్ కు పంపేందుకు అంగీకరించారు. 

కెనడా, మెక్సికో ల బార్డర్ లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసేందుకు ట్రంప్ ప్లాన్ వర్కౌట్ అయిందని అంటున్నారు. అయితే ట్రేడ్ విషయంలో ట్రంప్ వ్యూహాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయని మెక్సికో, కెనడా ప్రతినిధులు అభిప్రాయ పడుతున్నారు.