
బచ్చన్నపేట, వెలుగు : అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో బుధవారం అభిమానులు సంబురాలు చేసుకున్నారు. కొన్నాళ్ల కింద అభిమాని బుస్స కృష్ణ తన ఇంటి వద్ద ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నాడు. కృష్ణ మృతి చెందిన అనంతరం కూడా గ్రామస్తులు ట్రంప్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించడంతో గ్రామ యువకులు ఆయన విగ్రహం వద్ద స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.