నవంబర్లో ట్రంప్ వివాదాస్పద బయోపిక్!

నవంబర్లో ట్రంప్ వివాదాస్పద బయోపిక్!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ది అప్రెంటీస్' నవంబర్ లో విడుదల కానుందని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు యూఎస్, కెనడియన్ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. 

 సినిమా తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ గతంలో ట్రంప్ వ్యతిరేకించారు. గార్బియెల్ షెర్మాన్ రచించిన ట్రంప్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు అలీ అబ్బాసీ దర్శకత్వం వహించారు. 1970 నుంచి 1980 మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎదిగి రాజకీయ నాయకుడిగా మారిన ట్రంప్ జీవితంలోని మలుపులు ఈ సినిమాలో చూపించారని సమాచారం. 

ఈ ఏడాది మే 20న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించారు. ఈ మూవీలో డోనాల్డ్ ట్రంప్‌గా సెబాస్టియన్ స్టాన్ నటించాడు.