ట్రంప్ క్రిప్టో కరెన్సీకి మస్తు డిమాండ్.. 3గంటల్లో రూ. 52వేల కోట్లు ట్రేడింగ్

ట్రంప్ క్రిప్టో కరెన్సీకి మస్తు డిమాండ్.. 3గంటల్లో రూ. 52వేల కోట్లు ట్రేడింగ్
  • 3 గంటల్లో రూ.52 వేల కోట్లకు‘$ ట్రంప్‌‌’ క్రిప్టో
  • భారీగా కొంటున్న క్రిప్టో ట్రేడర్లు

న్యూఢిల్లీ: యూఎస్ కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన క్రిప్టో కరెన్సీ $ట్రంప్‌‌,  లాంచ్ అయిన మూడు గంటల్లోనే సుమారు 300 శాతం పెరిగింది. మార్కెట్ క్యాప్ 6 బిలియన్ డాలర్ల (రూ.52 వేల కోట్ల)కు చేరుకుంది.

 ఈ మీమ్‌‌ కాయిన్ ధర 29 డాలర్లను టచ్ చేసింది. ‘ నా కొత్త అధికారిక ట్రంప్ మీమ్ ఇక్కడుంది! గెలుపు సంబరాలు జరుపుకునే టైమ్‌‌ వచ్చింది. ప్రత్యేక  ట్రంప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మీ $ట్రంప్‌‌ పొందండి’ అంటూ  ఎక్స్‌‌లో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

ఈ మీమ్ కాయిన్‌‌ను కొనేందుకు లింక్‌‌ను కూడా షేర్ చేశారు. ఈ టోకెన్‌‌ను సోలానా బ్లాక్‌‌చెయిన్‌‌పై డెవలప్ చేశారు. 20 కోట్ల కాయిన్‌‌లు సప్లయ్‌‌లో ఉన్నాయని అంచనా. 

రానున్న మూడేళ్లలో  ఈ నెంబర్‌‌ 100 కోట్ల కాయిన్లకు పెరిగే అవకాశం ఉంది. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం, ట్రంప్ ఆర్గనైజేషన్‌‌ సీఐసీ డిజిటల్‌తో సంబంధం ఉన్న  ఫైట్ ఫైట్ ఫైట్ ఎల్ఎల్‌‌సీ దగ్గర 80 శాతం $ట్రంప్‌‌  కాయిన్లు ఉన్నాయి. 

ట్రేడింగ్ యాక్టివిటీ ద్వారా ఈ సంస్థ డబ్బులు సంపాదిస్తోంది. ఇన్వెస్ట్‌‌మెంట్‌‌కు ఈ మీమ్‌‌ కాయిన్ సరికాదని నిపుణులు చెబుతున్నా, క్రిప్టో ట్రేడర్లు మాత్రం భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారు. శనివారం ఉదయం ఏకంగా 6.64 బిలియన్ డాలర్ల విలువైన ట్రేడింగ్ జరిగింది.