తట్టాబుట్టా సర్దుకోండి.. 205 మంది భారతీయులను పంపించేసిన ట్రంప్

తట్టాబుట్టా సర్దుకోండి.. 205 మంది భారతీయులను పంపించేసిన ట్రంప్

యూఎస్ లో ఉంటున్న అక్రమ వలసదారులను వెనక్కు పంపించే యాక్షన్ ప్లాన్ కు స్పీడ్ పెంచారు ట్రంప్. అందులో భాగంగా 205 మంది భారతీయులను తిరిగి ఇండియాకు పంపిచేశారు. యుద్ధ ఖైదీల మాదిరిగా యూఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో అక్రమ వలసదారులుగా గుర్తించిన ఇండియన్స్ ను తిరిగి పంపించారు. టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం మంగళవారం (ఫిబ్రవరి 4) మద్యాహ్నం వరకు ఇండియా చేరుకోనుంది. 

ఎంతో కాలంగా అమెరికాలో ఉంటూ.. సేవ చేసిన తమను యుద్ధ ఖైదీల్లాగ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో తరలించడంపై తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ఇండియన్స్. ఆగమేఘాల మీద అత్యవసరంగా తీసుకురావడంపై ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ నిర్ణయంపై అధికారికంగా యూఎస్ లో ఉంటున్న భారతీయులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో భారత ప్రభత్వం కల్పించుకోవాలని కోరుతున్నారు. 

Also Read :- టారిఫ్లపై కాస్త తగ్గిన ట్రంప్

అయితే భారత వలసదారులను వెనక్కు రప్పించడంలో భారత విదేశాంగ శాఖ చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్ అధికారులతో చర్చించి తరలింపుకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు భారత అధికారులు. యూఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-17 ఎయిర్ క్రాఫ్ట్ లో మొత్తం 205 మందిని ఇండియాకు తరలిస్తున్నారు. గతంలో గ్వాటెమాల, పెరూ, హొండూరస్ వలసదారులను పంపించిన ట్రంప్.. తాజాగా ఇండియన్స్ ను వెనక్కు పంపించే కార్యక్రమాన్ని స్పీడప్ చేశారు. అందరినీ పరిశీలించాక, పత్రాలు లేకుండా ఉన్నట్లుగా గుర్తించిన అనంతరం ఇండియాకు తరలిస్తున్నారు. 

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయ పౌరులందరినీ గుర్తించి,స్వదేశానికి రప్పించేందుకు డొనాల్డ్ ట్రంప్ కు సహకరించేందుకు భారత్ సిద్దంగా ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ రిపోర్టులు చెబుతున్నాయి. దాదాపు 18వేల మంది అక్రమ భారతీయ వలసదారులను వెనక్కి పంపాలని అమెరికా గుర్తించింది.. దీనికోసం భారత్ ధృవీకరంచి బహిష్కరణ ప్రక్రయ ప్రారంభిస్తుందని నివేదిక పేర్కొంది. 
అమెరికాల అధికారిక లెక్కల  ప్రకారం.. 2023-24లో 1100 మంది భారతీయ పౌరులను అమెరికా డిపార్టుమెంట్ ఆఫ హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగంబహిష్కరించింది. భారత్ సహా 145 దేశాలకు చెందిన స్వదేశీ విమానాల ద్వారా లక్షా 60వేల మందిని పంపించారు. 

2024లో చట్టవిరుద్ధంగా అమెరికాలో కి ఉత్తర సరిహద్దు ద్వారా వలసలు పెరిగాయి. ఇందులో 3 శాతం మంది భారతీయులు అమెరికాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. 
022 నుండి, ఫిలిప్పీన్స్‌ను అధిగమించి, యుఎస్ చెక్‌పోస్టులలో ఆసియా నుండి అక్రమ వలసదారులలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు.

2023-2024లో 90,415 మంది భారతీయులు అక్రమ ప్రవేశానికి ప్రయత్నించారని గుర్తించారు. 2022 నాటికి అమెరికా వ్యాప్తంగా ఉన్న 13.3 మిలియన్ల అక్రమ వలసదారుల్లో 2లక్షల 20వేల మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. 

ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను పంపిచ్చేస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే గ్వాటెమాల, పెరూ, హొండూరస్ వలసదారులను పంపించిన ట్రంప్.. తాజాగా ఇండియన్స్ ను వెనక్కు పంపించే కార్యక్రమాన్ని స్పీడప్ చేశారు. అందరినీ పరిశీలించాక, పత్రాలు లేకుండా ఉన్నట్లుగా గుర్తించిన అనంతరం ఇండియాకు తరలిస్తున్నారు.