Trumps reciprocal tariffs: ట్రంప్ రెసిప్రోకల్ తారిఫ్స్.. ఇండియాలో నష్టపోయే రంగాలు ఇవే

Trumps reciprocal tariffs: ట్రంప్ రెసిప్రోకల్ తారిఫ్స్.. ఇండియాలో నష్టపోయే రంగాలు ఇవే

ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. విదేశాలపై దిగుమతి సుంకాలు పెంచిన విషయం తెలిసిందే.. వచ్చీ రాగానే మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాలు పెంచిన విషయం తెలిసిందే.. వీటితోపాటు భారత్ పై కూడా ట్రంప్ దిగుమతి సుంకాల ప్రభావం పడింది.ఈ దిగుమతి సుంకాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. 

డోనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల వల్ల భారతదేశంపై ఏటా 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా సుంకాల వల్ల కెమికల్స్, మెటల్స్, ఆర్నమెంట్స్ ఎక్కువగా ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. వ్యవసాయ రంగం వ్యవసాయ ఉత్పత్తులు కూడా అమెరికా దిగుమతి సుంకాల ప్రభావం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. 

2024లో భారత్ అమెరికాకు 74 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసినట్లు అంచనా. వీటిలో ముత్యాలు, రత్నాలు, ఆభరణాలు వ8.5 బిలియన్ల డాలర్లు కాగా.. మెడిసిన్స్ 8బిలియన్ల డాలర్లు. ఇక పెట్రోకెమికల్స్ దాదాపు 4 బిలియన్ల డాలర్లు. 

అమెరికా దిగుమతులపై భారతదేశం విధించే సుంకాలు సాధారణంగా భారత ఎగుమతులపై అమెరికా విధించే సుంకాల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణగా అమెరికా మోటార్ సైకిళ్లపై భారతదేశం 100శాతం  సుంకం విధిస్తే.. అమెరికా భారతీయ మోటార్ సైకిళ్లపై 2.4శాతం మాత్రమే వసూలు చేస్తుంది.

ఒకవేళ భారత దేశ వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలను పెంచితే వ్యవసాయం రంగం కూడా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. అయితే తక్కువ సుంకాల గ్యాప్ తో బట్టలు, తోలు ,కలప ఉత్పత్తులు వంటి పరిశ్రమలు తక్కువ నష్టాన్ని ఎదుర్కొంటాయని అంచనా. 

ఈ సుంకాలను ఎలా లెక్కించాలనే దానిపై వివరాల కోసం అధికారులు ఇంకా వేచి ఉండగా, అమెరికా రెసిప్రోకల్ తారీఫ్ ను ఎలా ఎదుర్కోవాలో ప్రతిపాదనలు భారత్ సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుంకాలను తగ్గించడం,ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడం వంటి వాణిజ్య ఒప్పంద ప్రతిపాదనపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది.