పాక్, అఫ్గాన్పై .. ట్రంప్​ ట్రావెల్ బ్యాన్!

పాక్, అఫ్గాన్పై .. ట్రంప్​ ట్రావెల్  బ్యాన్!

వాషింగ్టన్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించ కుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ రెండు దేశాలపై ట్రావెల్ బ్యాన్  విధించనున్నారు. భద్రత, రిస్కు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పాక్, అఫ్గాన్​పై ప్రెసిడెంట్ నిషేధాన్ని అమలు చేయనున్నారని వైట్ హౌస్  వర్గాలు తెలిపాయి. 

దీనికి సంబంధించిన లిస్ట్​ ప్రిపేర్ అవుతోందని, వచ్చే వారంలో అమల్లో కి రావొచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ లిస్టులో పాక్, అఫ్గాన్ తో పాటు మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయని వెల్లడించాయి. కాగా.. ట్రంప్  తన మొదటి టర్ములో ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్  బ్యాన్  విధించారు. బైడెన్  ప్రెసిడెంట్  అయ్యాక 2021లో ఆ నిషేధాన్ని ఉపసంహరించారు.