సీఎం రేవంత్ రెడ్డికి ట్రస్మా డైరీ అందజేత

చండూరు, వెలుగు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నివాసంలో బుధవారం జరిగిన భువనగిరి పార్లమెంట్​ఎన్నికల సన్నాహక సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంను ట్రస్మా నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి ట్రస్మా డైరీని అందజేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ట్రస్మా మద్దతు ఇవ్వాలని సీఎం కోరారు. అనంతరం గాంధీజీ విద్యాసంస్థల క్యాలెండర్ ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు.