హైదరాబాద్, వెలుగు : స్మాల్ క్యాప్ ఫండ్‌ను ప్రారంభించినట్టు ట్రస్ట్ ఎంఎఫ్ ప్రకటించింది. ఇది ప్రధానంగా చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెడుతుంది. ఈ కంపెనీలు ఎదిగే దశలో ఉంటాయి, కాబట్టి వాటి షేర్ల ధరలు భవిష్యత్తులో ఎక్కువగా పెరగవచ్చని చెబుతోంది. కస్టమర్లు తమ పోర్ట్‌ఫోలియోలో డైవర్సిఫికేషన్కోసం ఈ ఫండ్‌ను చేర్చవచ్చని
ఈ ఫండ్ దీర్ఘకాలిక పెట్టుబడికి అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. ఎమర్జింగ్ స్మాల్‌క్యాప్ విభాగంలో వృద్ధిని అన్‌లాక్ చేయాలనే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చామంది. కొత్త ఫండ్ ఆఫర్ ఈ నెల 25 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది.