
- ఉచిత వసతి, భోజన సదుపాయాలు కూడా
వికారాబాద్, వెలుగు: స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 రోజుల ఉచిత మగ్గం శిక్షణ ఇస్తున్నట్లు ట్రస్ట్ యూనియన్రసెట్ డైరెక్టర్ జీఎస్ఆర్ కృష్ణ తెలిపారు. ఆసక్తిగా ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల వారు తమ పేర్లు రిజిస్టర్చేసుకోవాలని కోరారు. 19 నుంచి 45 ఏండ్లలోపు వారు అర్హులని, రాయడం, చదవడం తప్పనిసరిగా వచ్చి ఉండాలని తెలిపారు. నెల రోజుల ఉచిత శిక్షణతోపాటు ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
ఆధార్, రేషన్ కార్డులతోపాటు మూడు ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. స్వర్ణ భారత్ ట్రస్ట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సహకారంతో శంషాబాద్ముచ్చింతలలోని స్వర్ణభారత్ట్రస్ట్లో మగ్గం శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 3 నుంచి 30 రోజులపాటు శిక్షణ కొనసాగుతుందని, మరిన్ని వివరాల కోసం 78931 21143, 93914 87797, 91771 41712 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.