సర్కారు కాలేజీల బలోపేతానికి  కృషి చేద్దాం: ఆకునూరి

సర్కారు కాలేజీల బలోపేతానికి  కృషి చేద్దాం: ఆకునూరి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల బలోపేతానికి కృషి చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కోరారు. బుధవా రం ఇంటర్ విద్యా జేఏసీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో మార్పులు, జాతీయ విద్యా విధానంపై చర్చ, ఇంటర్ విద్య తీరుతెన్నులు, కార్పొరేటీకరణ తదితర అంశాలపై వారితో చర్చించారు. సర్కారు కాలేజీల్లో వసతుల ను కల్పించాలని, కాలేజీల్లో మిడ్​ డే మీల్స్ పెట్టాలన్నారు. సమావేశంలో ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామా రావు, ప్రధాన కార్యదర్శి కళింగ కృష్ణకు మార్, జీజేఎల్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాంజాదవ్, టీజీఎల్ఏ రాష్ట్ర  అధ్యక్షుడు కనకచంద్రం తదితరులు పాల్గొన్నారు.