మోడీజీ ప్లీజ్ హెల్ప్... కశ్మీరీని పెళ్లాడిన ఉక్రెయిన్ యువతి

ఉక్రెయిన్‌ ప్రజల్ని కాపాడాలని ప్రధాని మోడీవి కోరారు ఉక్రెయిన్ యువతి. ఉక్రెయిన్‌‌కు చెందిన ఒలిజా అనే యువతి కాశ్మీరిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ట్రాల్‌లో నివసిస్తున్నారు. అయితే పుల్వామా ఇంటికి తిరిగి వచ్చినా.. ఆమె తన కుటుంబం గురించి ఆందోళన చెందుతోందన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న తన కుటుంబాన్ని ప్రజల్ని కాపాడాలని ఆమె ఈ సందర్భంగా ప్రధానిని కోరారు. ఒలిజా మాట్లాడుతూ "నాకు చాలా బాధగా ఉంది. నా కుటుంబం అక్కడ ఉన్నందుకు నా గుండె తల్లడిల్లుతుంది. ఉక్రేనియన్లకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. వారు శాంతియుత ప్రజలు. అంటూ ఆమె ప్రధాని మోదీకి, భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.