ఇందిరమ్మ ఇండ్ల స్థలంలోనే డబుల్ ​ఇండ్లు కట్టినం: నాగర్తి భూమిరెడ్డి

భిక్కనూరు, వెలుగు: కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు మండలంలోని రామేశ్వరపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం జాగా కేటాయించగా, ప్రస్తుతం అక్కడ డబుల్​బెడ్ ​రూమ్​ఇండ్లు నిర్మించారని విండో చైర్మన్​ నాగర్తి భూమిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రామేశ్వర పల్లిలో ఏర్పాటుచేసిన మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి వర్షానికి డబుల్​బెడ్​రూమ్​ఇండ్లలో కొద్దిగా నీళ్లు చేరగానే విమర్శించే కాంగ్రెస్ ​పార్టీ లీడర్లకు స్థలం కేటాయించేటప్పుడు సోయి లేదా అని ప్రశ్నించారు.

Also Read : పల్లవి ప్రశాంత్ అంటే నాకు కూడా ఇష్టమే.. ఓపెన్గా చెప్పేసిన రతిక

కామారెడ్డిలో ఓటమి భయంతోనే బీఆర్ఎస్​పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్​ గ్రామ శాఖ అధ్యక్షుడు అనంత్​గౌడ్, విండో చైర్మన్​ నాగర్తి భూమిరెడ్డి, సర్పంచ్​ పోతిరెడ్డి పాల్గొన్నారు.