బీసీ గురుకులాల్లో బీఎస్సీ

బీసీ గురుకులాల్లో బీఎస్సీ

మహాత్మా జ్యోతిబాఫులె బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహించే వనపర్తి, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మహాత్మా జ్యోతిబాఫులె బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో 2023–-24 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం బీఎస్సీ(ఆనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సులో ప్రవేశాల ప్రకటన విడుదలైంది. అర్హులైన ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణులైన బాలికల సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన బాలికలకు ఉచిత విద్య, వసతి సౌకర్యాలు అందుతాయి.

అర్హతలు: ఇంటర్మీడియట్ (బైపీసీ) ఉత్తీర్ణులైన బాలికలు అర్హులు. ఎంసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2023 ర్యాంకు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. వయసు 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఎంసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2023 ర్యాంకు, రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్​ 6వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.