
తెలంగాణలో రాష్ట్రంలో ఇటీవల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షకు సన్నద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త తెలిపింది. ఉద్యోగార్థులకు బీసీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో బుక్ ఫండ్‌తోపాటు స్టడీ మెటీరియల్ ఖర్చును అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 వేల మందికి ఈ సాయాన్ని అందించనున్నారు. ఇందులో 7వేల మంది SGT అభ్యర్థులకు, 3 వేల మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు రూ.1500 చొప్పున బుక్ ఫండ్, స్టడీ మెటీరియల్ ఖర్చును అందిస్తారు. ఈ సాయం పొందాలనుకునేవారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించకూడదు. అకాడమిక్ మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 5లోగా ఆన్‌లైన్ ద్వారా ఈ ఆర్థిక సాయానికి తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.