తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆప్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2024 పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ రెండిండిటితోపాటు మెడికల్ స్ట్రీమ్ కీని విడుదల చేసింది.ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ eapcet.tsche.ac.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా అభ్యంతరాలుంటే ఇంజనీరింగ్ విద్యార్థులు మే 14 లోపు , అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు మే 13 లోపు తెలపాలి.
ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం ప్రిలిమినరీ కీతోపాటు ఆన్సర్ షీట్, ప్రశ్నాపత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 12 ఉదయం 10 గంటల నుంచి మే 14 ఉదయం 11 గంటల వరకు అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. అదే విధంగా అగ్రికల్చర్ ఫార్మీసీ స్ట్రీమ్ కోసం మే 11 ఉదయం 11 గంటల నుంచి మే 13 ఉదయం 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అభ్యంతరాలుంటే ఈ తేదీలలో తెలపవచ్చు.
TS EAMCET 2024 ఆన్సర్ కీ , రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్
అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inని సందర్శించండి. హోమ్‌పేజీ దిగువన ఉన్న TS EAMCET 2024 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయండి అని ఉన్న లింక్ ను క్లిక్ చేయాలి. తర్వాత మీ TS EAMCET హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్,పుట్టిన తేదీ (DoB) నమోదు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. స్క్రీన్ పైన ఆన్సర్ షీట్ కనబడుతుంది. డౌన్ లోడ్ చేసుకోవాలి. భవిషత్య్ అవసరాలకోసం ప్రింట్ తీసుకోవాలి.
అభ్యంతరం తెలిపే విధానం
ఆన్సర్లపై అభ్యంతరాలు తెలిపే విండోను క్లిక్ చేయండి. ఏదైన ఆన్సర్ డౌట్ అనిపించిందో దానిని సెలక్ట్ చేసుకోండి.దానికి తగిన సమాధానం అందించాలి. రుజువులను PDF లేదా JPEG లో అటాచ్ చేయండి. అడిగిన ఫీజును చెల్లించాలి. మీ అభ్యంతరాన్ని సబ్మిట్ చేసి రికార్డులకోసం పేజీని సేవ్ చేసుకోవాలి. అభ్యర్థులు TS EAMCET 2024 ఆన్సర్ కీలో ఎన్ని ప్రశ్నలకైనా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. కాని ఒక్కసారి మాత్రమే గమనించాలి. అభ్యంతరాలను జాబితా చేసేటప్పుడు, అభ్యర్థులు రుజువులుగా సరియైన డాక్యుమెంటేషన్‌ను అందించాలి.
ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం TS EAMCET లేదా EAPCET మే 9, 10 ,11 తేదీల్లో నిర్వహించారు. అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్‌లకు మే 7,8 తేదీల్లో పరీక్ష జరిగింది.