TS EAMCET 2024 అప్లయ్ చేసుకునేందుకు ఏప్రిల్6న గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే అప్లికేషన్లలో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్8నుంచి ఆన్లైన్లో ఎంసెట్ 2024 దరఖాస్తు దిద్దుబాటు సౌకర్యాన్ని జవహర్లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ కల్పిస్తోంది.
ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 12వ తేదీవరకు యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి విద్యార్థులు తమ అప్లికేషన్లను కరెక్షన్ చేసుకోవచ్చు. దిద్దుబాటుకు యాక్సెస్ పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారి రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత, పరీక్ష హాల్ టికెట్, పేమెంట్ ఐడీ, మొబైల్ నంబర్, పుట్టిన తేదీని కలిగి ఉండాలి.
TS EAMCET దరఖాస్తు దిద్దుబాటుటు సమయంలో మాత్రమే నిర్దిష్ట వివరాలలో మార్పులు చేయడానికి అధికారులు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ఫారమ్ ను విజయవంతంగా నమోదు చేసుకున్న అభ్యర్థులు మే 1 ,2024 నుంచి TS EAMCET అడ్మిట్ కార్డు 2024 ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫారమ్ ను ఎలా ఎడిట్ చేయాలంటే..
- TS EAMCET అధికారిక వెబ్ సైట్ eapcet.tsche.ac.in లోకి వెళ్లాలి.
- TS EAPCET 2024 హోం పేజీ పైన క్లిక్ చేయాలి.
- అభ్యర్థులు అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి
- వివరాలు ఎంటర్ చేయగానే TS EAPCET 2024 అప్లికేషన్ ఫారమ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
- ఇప్పుడు అభ్యర్థులు ఎదైతే కరెక్షన్ చేయాలనుకుంటున్నారో వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు.
- వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత Submit బటన్ క్లిక్ చేయాలి
నోట్ : తప్పనిసరిగా TS EAPCET 2024 అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఒక ప్రింట్ ఔట్ కూడా తీసుకోవాలి