
- ఫార్మసీ అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలకు 53,705 మంది అటెండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఎప్ సెట్ ఎగ్జామ్స్ మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ స్టూడెంట్లకు 112 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు. రెండు సెషన్లలో కలిపి 57,664 మందికి 53,705 (93.13%) మంది పరీక్షకు అటెండ్ అయ్యారు. మరో 3,959 మంది వివిధ కారణాలతో పరీక్షలకు హాజరు కాలేదు.
కాగా, ఎప్ సెట్ పరీక్షలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, వర్సిటీ రెక్టర్, ఎప్ సెట్ కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి, కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీరామ్ వెంకటేశ్, ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు తదితరులు పర్యవేక్షించారు. బుధవారం కూడా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ స్టూడెంట్లకు పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు పరీక్షలు నిర్వహించనున్నారు. నిర్ణీత టైమ్‌కు రెండు గంటల ముందు నుంచే స్టూడెంట్లు, పేరెంట్స్ సెంటర్లకు చేరుకున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు.