
హైదరాబాద్: రేపు ఎంసెట్ షెడ్యూల్ విడుదల అవుతోంది. వచ్చే జులై 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం లో 100 శాతం సిలబస్ తో.. ద్వితీయ సంవత్సరంలో 70 శాతం తో సిలబస్ తో ఎంసెట్ నిర్వహించనున్నట్లు జేఎన్టీయూ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వల్ల ఈ విద్యా సంవత్సరం చాలా వరకు తరగతులు జరగకపోవడంతో సిలబస్ 30 శాతం తగ్గించారు.