మార్చి 6 నుంచి ఎడ్ సెట్ దరఖాస్తులు

హైదరాబాద్,వెలుగు: ఈ నెల 6 నుంచి బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఎడ్ సెట్ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎడ్ సెట్ కన్వీనర్ మృణాళిని తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా మే 6 వరకూ అప్లై చేసుకోవచ్చని చెప్పారు. రూ.250 ఫైన్​తో మే 13 వరకూ అప్లై చేసుకోవచ్చని వివరించారు. కాగా, మే 23న ఎడ్ సెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.