బిగ్ అలర్ట్.. టీఎస్ ఎడ్​సెట్ నోటిఫికేషన్​ రిలీజ్

బిగ్ అలర్ట్.. టీఎస్ ఎడ్​సెట్ నోటిఫికేషన్​ రిలీజ్

కేయూ క్యాంపస్, వెలుగు: బీఎడ్​కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్​సెట్​2025కు ఈ నెల 12 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కాకతీయ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం కేయూ వీసీ కె.ప్రతాప్​రెడ్డి, కన్వీనర్​బి.వెంకట్రామ్​రెడ్డి వర్సిటీ అధికారులతో కలిసి టీజీ ఎడ్​సెట్​నోటిఫికేషన్‎ను రిలీజ్​చేశారు. ఈ నెల 12 నుంచి మే 13వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 లేట్​ఫీజుతో మే 20వ తేదీ వరకు, రూ.500 లేట్​ఫీజుతో మే 24వ తేదీ వరకు అప్లై చేసుకొనే చాన్స్​ఇచ్చారు. 

అర్హత కలిగిన అభ్యర్థులంతా ఆన్​ లైన్‎లో దరఖాస్తులు సబ్మిట్​చేయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550, మిగతా వాళ్లు రూ.750 చెల్లించి రిజిస్ట్రేషన్​చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, జూన్​ 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు సెషన్లలో ఎంట్రెన్స్​టెస్ట్ నిర్వహించనున్నారు.