- జగిత్యాల జీవన్ రెడ్డిదే సింగిల్ అప్లికేషన్
- కరీంనగర్ కు అత్యధికంగా 15 , హుజూరాబాద్, కోరుట్లలో 13
- మంథని, మానకొండూరు నుంచి 2 చొప్పున అప్లికేషన్లు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు మొత్తం 85 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ నుంచి 15, కోరుట్ల, హుజూరాబాద్ నుంచి 13 చొప్పున దరఖాస్తులు అందాయి. జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అప్లికేషన్ ఒక్కటే రాగా.. మంథని, మానకొండూరు నుంచి 2 చొప్పున దరఖాస్తులు వచ్చాయి.
కరీంనగర్ నియోజకవర్గంలో..
కరీంనగర్ నుంచి అప్లై చేసుకున్నవారిలో రేగులపాటి రమ్యారావు, మేనేని రోహిత్ రావు, డాక్టర్ కొనగాల మహేశ్, వైద్యుల అంజన్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ సమద్(నవాబ్), కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పురుమళ్ల శ్రీనివాస్, జువ్వాడి నిఖిల్ చక్రవర్తి, రేగులపాటి రితీశ్‌రావు, సత్తు మల్లయ్య, కర్రా సత్యప్రసన్న రెడ్డి, పడాల రాహుల్, ఎండీ రహమత్ హుస్సేన్, కొత్త జైపాల్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్‌కు చెందిన కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరకుండానే అప్లై చేసుకున్నాడు.
చొప్పదండి నుంచి మేడిపల్లి శ్యాం, జిల్లాల భానుప్రియ, వెన్న రాజా మల్లయ్య, కాశిపాక రాజేశ్, చిగురు శకుంతల, నాగి శేఖర్, మ్యాక లక్ష్మణ్..హుజూరాబాద్ నుంచి పత్తి రామకృష్ణా రెడ్డి, జాలి కమలాకర్ రెడ్డి, ఒంటెల లింగారెడ్డి, ప్యాట రమేశ్, కటంగురి బుచ్చిరెడ్డి, సారంగపాణి, బల్మూరి వెంకట్ నర్సింగరావు, తౌటం రవీందర్, ముద్దసాని కశ్యప్ రెడ్డి, సాయిని రవికుమార్, పూదారి రేణుక, దాసరి భూమయ్య, తిప్పర సంపత్ అప్లై చేసుకున్నారు. మానుకొండూరు నుంచి డా.కవ్వంపల్లి సత్యనారాయణ, తిప్పర సంపత్ అప్లై చేసుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలో పోటీ ఎక్కువే
రామగుండం నుంచి ఎంఎస్ రాజ్ ఠాకూర్, హర్కర వేణుగోపాలరావు, బజ్‌పల్ జనక్ ప్రసాద్, అంచర్ల మహేశ్ యాదవ్ , రియాజుద్దీన్ అహ్మద్, గంటా సత్యనారాయణ రెడ్డి దరఖాస్తు సమర్పించారు. మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శివ నందరి ప్రమోద్ కుమార్ అప్లై చేసుకున్నారు. పెద్దపల్లి నుంచి కిరణ్ కుమార్ వేల్పుల, చింతకుంట విజయ రమణారావు, గంటా రాములు, చేతి ధర్మయ్య, ఈర్ల కొమురయ్య అప్లై చేశారు.
రాజన్న జిల్లాలో..
రాజన్నసిరిసిల్ల జిల్లాలో వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, ముడికె చంద్రశేఖర్ యాదవ్, తొట్ల అంజయ్య యాదవ్, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, సిరిసిల్ల నుంచి సంగీతం శ్రీనివాస్, చీటి ఉమేశ్ రావు, నాగుల సత్యనారాయణ, కొండం కరుణ మహేందర్ రెడ్డి అప్లై చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో కలిసిన హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ఒంటెల లింగా రెడ్డి, బాలిశెట్టి శివయ్య, ఒంటెల రత్నాకర్, డాక్టర్ గజ్జెల మల్లేష్ దరఖాస్తు చేసుకున్నారు.
జగిత్యాలలో ఒక్కటే అప్లికేషన్
జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఒక్కరే అప్లై చేసుకున్నారు. కోరుట్ల నుంచి కల్వకుంట్ల సుజిత్ రావు, కొమిరెడ్డి జ్యోతిదేవి, జువ్వాడి నర్సింగరావు, రుద్ర శ్రీనివాస్, రుద్రశంకర్, మహ్మద్ షకీర్ సిద్ధిఖీ, కొమిరెడ్డి కరంచంద్, కోట దుర్గారాజ్, కట్లపెల్లి శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, అసిఫ్ హబీబ్, అలీ పాండురంగ, మహమ్మద్ హబీబ్ ఖాన్ అప్లై చేసుకున్నారు. ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గజ్జెల స్వామి, వడ్లూరి కృష్ణ, గుమ్మడి కుమారస్వామి, బండారి కనకయ్య, మద్దెల రవీందర్, బోళ్ల స్వామి దరఖాస్తు చేసుకున్నారు.