కామారెడ్డి జిల్లా: ప్రతి జిల్లా కేంద్రంలో ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించామని తెలిపారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. డబుల్ బెడ్రూంలు ఎక్కడ కట్టారని కొంతమంది పదేపదే అడుగుతున్నారని ప్రస్తావించిన ఆయన.. బాన్సువాడకు వస్తే డబుల్ బెడ్రూం ఇళ్లు చూపిస్తామన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి పర్యటించారు హరీశ్ రావు.
రూ.40కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీ, 69.52కోట్లతో నిజాంసాగర్ మెయిన్ కెనాల్ పై జాకోరా గ్రామం దగ్గర నిర్మించనున్న ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. గోదావరి నీళ్లు మంజీరాకు రావడంతోనే జాకోరా లిఫ్ట్ సాధ్యమైందన్నారు స్పీకర్. లిఫ్ట్ పూర్తయితే.. 6వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
తెలుగు అకాడమీ విభజన కేసు పిటిషన్ వెనక్కి
కాంగ్రెస్ ఎజెండా లేకుండా సమావేశం నిర్వహిస్తే స్వాగతిస్తాం