- 20 రోజులకే తొలగించిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ లో అర్జీలు పెట్టుకునేందుకు ఉన్న ఆప్షన్ డిలీట్ అయింది. భూముల గట్లు, విస్తీర్ణం, అటవీ సరిహద్దు వివాదాలు, పట్టాదారు పాస్ బుక్ సమస్యల పరిష్కారానికి ధరణి లో అప్లై చేసుకునేందుకు పెట్టిన ఆప్షన్ ను ప్రభుత్వం తొలగించింది. ‘అప్లికేషన్ఫర్ ల్యాండ్ మ్యాటర్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆప్షన్ ద్వారా బాధితులు నేరుగా కలెక్టర్‌కు అర్జీ పెట్టుకునేందుకు చాన్స్ ఉండేది. జనవరి 20న అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్ ద్వారా వేలాది మంది రైతులు అర్జీలు పెట్టుకున్నారు. 20 రోజులు తిరగకుండానే ఈ ఆప్షన్‌ను సర్కార్ తొలగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బాధిత రైతులు రోజూ కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. ధరణి పోర్టల్ లో ‘గ్రీవెన్స్రిక్వెస్ట్’ అనే ఆప్షన్ కూడా నెల రోజుల కింద పెట్టారు. కానీ పెట్టినప్పటి నుంచీ ఈ ఆప్షన్ పని చేస్తలేదు. దీనిపై క్లిక్‌చేస్తే ‘నో రికార్డ్స్ఫౌండ్’ అని చూపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
అచ్చంపేట టు హైదరాబాద్.. రేవంత్ పాదయాత్ర
మేం అధికారంలోకి వస్తే కేసీఆర్ జైలుకే
మూడు నెలల సదువులకు ఏడాది ఫీజు కట్టాల్నట
గవర్నర్ లెటర్‌తో సర్కారులో కదలిక