కాల్వలు అయినయ్​...పరిహారం ఆగింది

  • సదర్ మాట్, కాళేశ్వరం కాలువల కింద వెయ్యి ఎకరాలకు బకాయి
  • పట్టించుకోని ప్రభుత్వం
  • రెండేండ్లుగా ఎదురుచూస్తున్న రైతులు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో వివిధ సాగునీటి పథకాల పనుల కోసం సేకరించిన భూములకు ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం అందించలేదు. ఓ వైపు సాగు భూమి కోల్పోయి, మరోవైపు ఆ భూములకు పరిహారం అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా సదర్ మాట్ బ్యారేజీ, కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27, 28 హై లెవెల్ కాలువలకు సంబంధించి సేకరించిన భూమిలో దాదాపు వెయ్యి ఎకరాలకు ఎలాంటి పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు. ఈ డబ్బుల కోసం రైతులు రెండేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొంత అప్పజెప్పి.. మరికొంత పెండింగ్​సదర్ మాట్​ బ్యారేజీ నిర్మాణం కోసం మొత్తం 1176 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. 

ఇందులో నిర్మల్ జిల్లాలో 806 ఎకరాలు సేకరించి 720 ఎకరాలకు రూ.73 కోట్ల 28 లక్షల పరిహారాన్ని రైతులకు అందించింది. మిగతా 85 ఎకరాలకు రూ.5 కోట్ల 70 లక్షల పరిహారం రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఇక జగిత్యాల జిల్లాలో మొత్తం 369 ఎకరాల భూమిని సేకరించి 314 ఎకరాలకు రూ.31 కోట్ల 64 లక్షలను రైతులకు చెల్లించారు. మరో 55 ఎకరాల మూడు గుంటల భూమికి సంబంధించి రూ.5 కోట్ల 30 లక్షలు ఇంకా బకాయి ఉంది. మొత్తంగా సదర్ మాట్ బ్యారేజీ పరిధిలోని రైతులకు రూ.11 కోట్లు  ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని సంబంధిత అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ALSO READ:ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు త్రెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌! లాంచ్ అయిన ఏడు గంటల్లోనే కోటి యూజర్లు

కాళేశ్వరం పరిధిలోనూ ఇదే పరిస్థితి

నిర్మల్, ముథోల్ నియోజకవర్గం కలిపి మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27, 28 హై లెవెల్ కాలువల కింద సేకరించిన భూములకు కూడా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. ముఖ్యంగా ప్యాకేజీ నంబర్ 27 పరిధిలో 50 వేల ఎకరాలకు సాగును అందించే లక్ష్యంతో కాలువ నిర్మాణ పనులు చేపట్టగా.. ఏండ్లు గడుస్తున్నా పనులు పూర్తికావడం లేదు. పరిహారానికి సంబంధించిన డబ్బులు కూడా అందకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. 27వ నంబర్  ప్యాకేజీ  కాలువ నిర్మాణం కోసం 2,500 ఎకరాల భూమిని ఉంచాలని ప్రతిపాదించారు. ఇందులో నుంచి 1621 ఎకరాల భూమిని సేకరించి పరిహారం డబ్బులు అందించినప్పటికీ మరో 374 ఎకరాల భూమికి సంబంధించి రూ.10 కోట్ల మేర రైతులకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగానే ఈ డబ్బులు విడుదల చేయడం లేదని సమాచారం.

పరిహారం కోసం ప్రతిపాదనలు పంపాం..

నిర్మల్ జిల్లాలోని సదర్ మాట్, కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27 హై లెవెల్ కెనాల్​కు సంబంధించి మిగిలిన పరిహారం డబ్బుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. మొదట్లో సేకరించిన భూములకు సంబంధించి పరిహారాన్ని ఇప్పటికే రైతులకు చెల్లించాం. మిగతా పరిహారాన్ని కూడా త్వరలోనే చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నాం. నిధులు విడుదల కాగానే చెల్లింపుల ప్రక్రియ పూర్తిచేస్తాం.
– రామారావు,ఈఈ నిర్మల్