ఐనవోలు ఆలయ చైర్మన్ పీఠంపై కిరికిరి!

  • ఐలోని మల్లన్న ఆలయ ట్రస్ట్ బోర్డును ప్రకటించిన ప్రభుత్వం
  • అనర్హులకు పదవి ఇచ్చారని ఆరోపణలు
  • హడావుడిగా కమిటీ వేయడంపై విమర్శలు

హనుమకొండ, ఐనవోలు, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లన్న ఆలయంపై సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈసారి కమిటీ ఏర్పాటులోనూ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైర్మన్​ పదవిని తమ అనుకున్నవారికి అప్పగించేందుకు వర్ధన్నపేట నియోజకవర్గ లీడర్లు ఇష్టారీతిన సభ్యులను ఎంపిక చేశారనే విమర్శలున్నాయి. దీంతో మొన్నటివరకు ఆలయ చైర్మన్​ పదవిపై ఆశపెట్టుకున్న కొంతమంది.. న్యాయం పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే ఏటా జాతరకు రెండు రోజుల ముందు మాత్రమే పాలకవర్గాన్ని నియమిస్తుండగా.. ఈసారి కూడా అదే పద్ధతి పాటించడంతో అనర్హులను గద్దెనెక్కించడానికే కమిటీ ప్రకటనపై జాప్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

జీవోను పట్టించుకోని లీడర్లు..

హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్​ నియామకం విషయంలో ఇక్కడి లీడర్లు, ఆఫీసర్లు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారు. ఆలయంలో హక్కుదారులకు ట్రస్ట్​ బోర్డు సభ్యులుగా అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వ జీవో చెబుతోంది. ఆలయ ఆస్తుల కౌలుదారులు, కాంట్రాక్టర్లు, న్యాయవాదులు, దేవాదాయశాఖ ఉద్యోగులు, ఆలయం నుంచి లబ్ధి పొందే వ్యక్తులు యోగ్యులు కారనే నిబంధన ఉంది. చైర్మన్ పీఠంపై అలాంటి అనర్హతలు లేని ఓసీ, బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకులు పోటీ పడ్డారు. కానీ జాతర రెండ్రోజుల్లో ప్రారంభమవుతోందనగా మంగళవారం రాత్రి ఎక్స్​అఫీషియో మెంబర్ సహా 15 మందితో కూడా పాలకవర్గాన్ని ప్రకటించారు. నియోజకవర్గ నేతలు రూల్స్​ కాలరాసి చైర్మన్​ పదవి కోసం హక్కుదారుగా ఉన్న జయపాల్ ను ట్రస్ట్ బోర్డు సభ్యునిగా ఎంపిక చేయడం విమర్శలకు తావిస్తోంది. వ్యక్తిగతంగా ఆయనకు పార్టీలో, నియోజకవర్గంలో మంచిపేరు ఉన్నప్పటికీ ఆలయంలో వాటాదారుగా కొనసాగుతున్న వ్యక్తిని రూల్స్​కు విరుద్ధంగా ఎలా ఎంపిక చేస్తారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆలయ చైర్మన్ ఎంపికపై కిరికిరి నడుస్తోంది.

ఏటా చివరి నిమిషంలోనే.. 

ఐనవోలు  జాతర శుక్రవారం నుంచి ఉగాది వరకు కొనసాగుతుంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా చాలా పనులు పెండింగ్​లోనే ఉన్నాయి. ఆలయంలో తాగునీరు, మరుగుదొడ్లు, స్నాన వాటికలు, వసతికి సంబంధించిన  సమస్యలు చాలా వేధిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో పాలకవర్గం లేకపోవడం, ఈవో ఒక్కరే అంతా నడిపిస్తుండటంతో ఏటా జాతర సమయంలో టెంపరరీ ఏర్పాట్లు చేస్తూ నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొద్దిరోజుల ముందుగానే  పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తే సరైన సమయంలో వివిధ అభివృద్ధి పనులు జరిగేవి. కానీ నియోజకవర్గ నేతలు తమ రాజకీయ స్వార్థాల కోసం జాతర ప్రారంభమయ్యే వరకు కమిటీని ప్రకటించడం లేదనే విమర్శలున్నాయి.

హనుమకొండ, ఐనవోలు, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లన్న ఆలయంపై సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.  ఈసారి కమిటీ ఏర్పాటులోనూ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైర్మన్​ పదవిని తమ అనుకున్నవారికి అప్పగించేందుకు వర్ధన్నపేట నియోజకవర్గ లీడర్లు ఇష్టారీతిన సభ్యులను ఎంపిక చేశారనే విమర్శలున్నాయి. దీంతో మొన్నటివరకు ఆలయ చైర్మన్​ పదవిపై ఆశపెట్టుకున్న కొంతమంది.. న్యాయం పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే ఏటా జాతరకు రెండు రోజుల ముందు మాత్రమే పాలకవర్గాన్ని నియమిస్తుండగా.. ఈసారి కూడా అదే పద్ధతి పాటించడంతో అనర్హులను గద్దెనెక్కించడానికే కమిటీ ప్రకటనపై జాప్యం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

జీవోను పట్టించుకోని లీడర్లు..

హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్​ నియామకం విషయంలో ఇక్కడి లీడర్లు, ఆఫీసర్లు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారు. ఆలయంలో హక్కుదారులకు ట్రస్ట్​ బోర్డు సభ్యులుగా అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వ జీవో చెబుతోంది. ఆలయ ఆస్తుల కౌలుదారులు, కాంట్రాక్టర్లు, న్యాయవాదులు, దేవాదాయశాఖ ఉద్యోగులు, ఆలయం నుంచి లబ్ధి పొందే వ్యక్తులు యోగ్యులు కారనే నిబంధన ఉంది. చైర్మన్ పీఠంపై అలాంటి అనర్హతలు లేని ఓసీ, బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకులు పోటీ పడ్డారు. కానీ జాతర రెండ్రోజుల్లో ప్రారంభమవుతోందనగా మంగళవారం రాత్రి ఎక్స్​అఫీషియో మెంబర్ సహా 15 మందితో కూడా పాలకవర్గాన్ని ప్రకటించారు. నియోజకవర్గ నేతలు రూల్స్​ కాలరాసి చైర్మన్​ పదవి కోసం హక్కుదారుగా ఉన్న జయపాల్ ను ట్రస్ట్ బోర్డు సభ్యునిగా ఎంపిక చేయడం విమర్శలకు తావిస్తోంది. వ్యక్తిగతంగా ఆయనకు పార్టీలో, నియోజకవర్గంలో మంచిపేరు ఉన్నప్పటికీ ఆలయంలో వాటాదారుగా కొనసాగుతున్న వ్యక్తిని రూల్స్​కు విరుద్ధంగా ఎలా ఎంపిక చేస్తారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆలయ చైర్మన్ ఎంపికపై కిరికిరి నడుస్తోంది.

ప్రజాప్రతినిధులకు సత్కారం..

ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డును మంగళవారం రాత్రి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ట్రస్ట్ బోర్డు సభ్యులు 14 మంది బుధవారం ఉదయం మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​, డీసీసీబీ చైర్మన్​ మార్నేని రవీందర్​ రావును మర్వాదపూర్వకంగా కలిశారు. ఇందులో కమిటీ చైర్మన్​ మజ్జిగ జయపాల్,  సభ్యులు మందపురి రాజబాబు, పొన్న వీరస్వామి, బండి సాయిలు, రామిండ్ల స్వప్న, మాడిషెట్టి లక్ష్మణ్, ఆబర్ల సాయిలు, గొక రాజు, బోల్లేపెల్లి వెంకటేశ్వర్లు, పాక ఉపేందర్, మండల సత్తయ్య, చేవ్వ రాజు, మండల సమ్మి రెడ్డి, దుప్పెల్లి శారద(దాత), ఎక్స్​ అఫీషియో సభ్యుడు, ఉప ప్రధాన అర్చకుడు రవీందర్ ఉన్నారు.