తెలంగాణలో ప్రతి బిడ్డకు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా నాణ్యమైన చదువు అందించడమే తన లక్ష్యమని సీఎం కేసీఆర్ రాష్ట్రం వచ్చిన కొత్తలో చెప్పారు. అందులో భాగంగానే కేజీ టు పీజీ ఉచిత విద్య అని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఏడేండ్లు అవుతున్నా విద్యా రంగంపై సీరియస్‌గా దృష్టి పెట్టలేదు. టీచర్ల రిక్రూట్‌మెంట్లు, ప్రమోషన్లు గాలికి వదిలేసి సర్కారీ బడులను ఆగం చేస్తున్నారు.
సొసైటీలో అందరి ప్రయోజనాలు, అభివృద్ధి కోసం పిల్లల్లో స్కిల్స్ పెంచేది చదువే. ఈ విషయం తెలిసి ప్రభుత్వం చదువుల పట్ల శ్రద్ధ చూపకపోవడం దారుణం. సీమాంధ్ర పాలకులు చదువుల్లో మన సామాజిక, సాంస్కృతిక అంశాలు లేకుండా చేశారని, మన బిడ్డలకు మంచి చదువులు అందకుండా చేశారని నాయకులు ఆరోపించారు. సమాన విద్య అందించలేదని, నిధులు, నియామకాలు సరిపడనంత చేయలేదని అందరం అన్నాం. ఆ కారణంగానే దేశ సగటు అక్షరాస్యత 74% అయితే తెలంగాణలో 66.54% ఉందని చెప్పుకొచ్చాం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా నిధులు లేక, టీచింగ్ స్టాఫ్ కొరత, అరకొర వసతులతో ప్రభుత్వ విద్యా రంగం దెబ్బతినడం బాధాకరం.
ఏటా దిగజారుతున్న ఎడ్యుకేషన్ బడ్జెట్
రాష్ట్రంలో ప్రైమరీ లెవెల్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకూ సర్కారీ చదువుల్లో వసతులు మొదలు, ఫ్యాకల్టీ కొరతతో క్వాలిటీ పడిపోతోంది. ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థలను కంట్రోల్ చేసి, మంచి స్టాండర్డ్స్‌తో సర్కారీ చదువులు ప్రతి ఒక్కరికీ అందేలా చేస్తామని గతంలో అనేక సార్లు సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ రాష్ట్రంలో 25,966 ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లను పట్టించుకోవట్లేదు. ఏటా బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ 2014-–15లో 10.88 శాతమే నిధులు కేటాయిస్తే..2020-–21లో 6.6 శాతం నిధులే కేటాయించారు. గతేడాది ఆర్బీఐ నివేదికలో దేశంలో విద్య, వైద్యంపై అత్యల్పంగా ఖర్చుచేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉందని తెలిపింది.
టీచర్లు లేక చదువులు ఆగం..
రాష్ట్రంలో 67 శాతం ప్రైమరీ స్కూళ్లు ఒకరిద్దరు టీచర్లతోనే నడుస్తున్నాయి. 12 వేల స్కూళ్లకు ప్లే గ్రౌండ్ లేదు. 6,874 స్కూళ్లకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, 7 వేల స్కూళ్లకు మరుగుదొడ్లు లేవు. 2,145 స్కూళ్లకు కరెంట్ లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల టీచరు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారే 8, 972 పోస్టులను భర్తీ చేశారు. స్కూళ్లలో వేలాది ఖాళీలు ఉండడంతో గతేడాది 16,781 విద్యావాలంటీర్లను నియమించారు. అయితే రాష్ట్రంలో 7 వేల స్కూల్ అసిస్టెంట్, 10,479 లాంగ్వేజ్ పండిట్, పీఈటీ పోస్టులు, 3800 హెడ్మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భారీగా టీచర్లు, హెడ్మాస్టర్లు, ఎంఈవోల పోస్టులు ఖాళీగా ఉండడంతో సర్కారీ బడుల్లో చదువుల క్వాలిటీ పడిపోతోంది. ఇటీవల నీతి ఆయోగ్ దేశంలోని 20 రాష్ట్రాల్లో సర్వే చేస్తే ‘స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ ర్యాంకింగ్స్’లో తెలంగాణ 14వ స్థానంలో ఉంది.
రిక్రూట్మెంట్ లేదు.. ప్రమోషన్లూ లేవ్
రాష్ట్రంలోని 592 మండలాల్లో 576 చోట్ల ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కొత్త మండలాలకు 48 ఎంఈవో పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. వీటితో పాటు భారీ సంఖ్యలో హెడ్మాస్టర్, ఇతర పోస్టులు ప్రమోషన్ల ద్వారా భర్తీ కావాలి. కానీ రాష్ట్రంలో ఎంఈవోలు పద్నాలుగేండ్లుగా, ఇతర పోస్టులకు ఏడేండ్లుగా ప్రమోషన్లు ఇవ్వలేదు. ఒకవైపు రిక్రూట్‌మెంట్లు లేక.. మరోవైపు ఉమ్మడి సర్వీసు రూల్స్, కోర్టు కేసుల పేరు చెప్పి ప్రమోషన్లు ఆపేసిన సర్కారు విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇక రాష్ట్రంలో 33 జిల్లాలకు గానూ ఐదు జిల్లాలకే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత 21 జిల్లాలకు కనీసం అసలు డీఈవో పోస్టులు మంజూరు చేయనేలేదు. అలాగే టీచర్ ట్రైనింగ్, విద్యా పరిశోధనకు సంబంధించిన పోస్టులు కూడా భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి.
రూరల్ స్కూల్స్‌లో సౌలతుల్లేవ్
రాష్ట్రంలో గురుకుల పాఠశాలల విషయంలో ప్రభుత్వం కొంచెం శ్రద్ధ చూపిస్తున్నా.. రూరల్ స్కూల్స్‌ను అస్సలు పట్టించుకోవడం లేదు. గడిచిన ఆరున్నరేండ్లలో 613 కొత్త గురుకులాలు ఏర్పాటు చేసి మొత్తంగా 900 వరకు నడిపిస్తున్నది. ఇందులో సుమారు మూడున్నర లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో స్టూడెంట్‌పై యావరేజ్‌గా ప్రభుత్వం లక్షా 32 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ రెగ్యులర్‌గా టీచర్లను నియమిస్తూ, ఎంట్రెన్స్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. కానీ రాష్ట్రంలో 24 లక్షల మంది వరకు చదువుకునే చిన్న పట్నాలు, గ్రామాల్లోని స్కూళ్లను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అసలు అక్కడ కనీస వసతులు ఉండట్లేదు.
మారుమూలకూ ప్రైవేటోళ్లు
రాష్ట్రంలో సర్కారీ స్కూళ్లను పట్టించుకోకపోవడం ఒకవైపు.. ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్ల దోపిడీ పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరి మరోవైపు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లపై విద్యా శాఖ అధికారుల కంట్రోల్ అస్సలు లేదు. తెలంగాణ ఏర్పడితే పొలిమేరలు దాటి తన్ని తరుముతామన్న శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు మారుమూల మండలాలకు కూడా విస్తరించాయి. పైగా ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్నా నియంత్రణ లేదు. కరోనా టైమ్‌లో ఫీజులు పెంచకూడదని రెండు జీవోలు ఇచ్చి మరీ ఆదేశాలు జారీ చేసినా పట్టించుకున్న నాధుడు లేడు. ప్రైవేటు స్కూళ్లు మూరుమూల ప్రాంతాలకు కూడా చేరడం, ఇంగ్లిష్ మీడియంపై మమకారం పెరగడంతో పాటు అదే టైమ్‌లో సర్కారీ బడుల్లో అసలు వసతులు లేక నాణ్యమైన విద్య అందకపోవడంతో ప్రజలు కూడా అటువైపు మొగ్గుచూపుతున్నారు. దీన్ని సాకుగా చూపి ప్రభుత్వం పిల్లలు లేరంటూ దాదాపు 2 వేలకు పైగా సర్కారీ బడుల్ని మూసేసింది. రాబోయే రోజుల్లో కన్సాలిడేషన్ ఆఫ్ స్కూల్స్, రేషనలైజేషన్ పేరిట మరిన్ని స్కూళ్లు మూసేసేందుకు ప్లాన్ చేస్తోంది.
హైయ్యర్ ఎడ్యుకేషన్ పరిస్థితీ దారుణం
హైయ్యర్ ఎడ్యుకేషన్‌ను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఎయిడెడ్, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు, వర్సిటీల్లో స్టాఫ్ రిక్రూట్‌మెంట్, వసతుల కల్పనపై దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రంలోని 404 జూనియర్ కాలేజీల్లో 4055 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 123 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2800 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వర్సిటీల్లోనూ భారీ సంఖ్యలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీసీల నియామకం కూడా జరగలేదు. ఉన్న ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్నా.. రిక్రూట్‌మెంట్ లేక వర్సిటీల్లో మరో మూడు నాలుగేండ్లలో అన్ని ఖాళీ పోస్టులే దర్శనమిచ్చేలా ఉంది పరిస్థితి. కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ వర్సిటీలను నిర్వీర్యం చేస్తూ మరోవైపు 5 ప్రైవేటు వర్సిటీలకు అనుమతులిచ్చారు.
హామీ నిలుపుకోవాలె
ప్రైమరీ లెవెల్ నుంచి యూనివర్సిటీల స్థాయి వరకు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యను నాశనం చేసి పేద, బడుగు వర్గాలకు చదువు అందకుండా చేయడం దుర్మార్గపు చర్య. ప్రైవేటు, కార్పొరేటు విద్యకు పెద్దపీట వేయడం ప్రమాదకరం. దీంతో
సామాజిక అసమానతలు మరింత పెరిగి.. రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతాయి. అందుకే గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా కేజీ టు పీజీ నాణ్యమైన విద్యను అందరికీ అందించడాన్ని బాధ్యతగా చేపట్టాలి. – ముస్కుల రఘుశంకర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్
సర్కారీ చదువులకు సున్నా చుడుతున్నరు
- వెలుగు ఓపెన్ పేజ్
- January 20, 2021
లేటెస్ట్
- IPL 2025 Mega Action: వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
- ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే
- US Probe Effect: అదానీతో వ్యాపారం రద్దు చేసుకున్న ఫ్రాన్స్ కంపెనీ
- మెగా వేలంలో 20 మందిని కొన్న చెన్నై.. నెక్ట్స్ సీజన్‌కు CSK ఫుల్ స్క్వాడ్ ఇదే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- నార్మన్ పోస్టర్స్ సంస్థకు దక్కిన అమరావతి భవనాల డిజైన్ల టెండర్
- కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది
- ఐపీఎల్ మెగా వేలంలో ఏపీ క్రికెటర్ల హవా.. ఆక్షన్‌లో ముగ్గురు సోల్డ్
- ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం.. కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు
- మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్
Most Read News
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- పారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా
- Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే
- తలుపులు మూసేసి రాత్రంతా దందా.. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక దాడులు