రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ పైసలతోనే పాలమూరు -- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కక్షపూరితంగా రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని ఆరోపించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను అణిచివేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని విమర్శించారు.
రంగారెడ్డి జిల్లా ఎల్లికట్టలో జరిగిన ప్రపంచ మృత్తిక దినోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం సాయం చేసినా.. చేయకపోయినా తెలంగాణలో అభివృద్ధి మాత్రం ఆగదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.