
బెల్లంపల్లి,వెలుగు: హాస్టల్లో మెనూ అమలు చేయాంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని టీఎస్ గురుకుల స్కూల్ స్టూడెంట్లు డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లి–లంబడితండా హైవేపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు మాట్లాడుతూ.. హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని, అరకొర భోజనం అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమను పట్టించుకోని ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలంటూ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎంఈవో పి.మహహేశ్వర్రెడ్డి, తాళ్లగురిజాల ఎస్సై నరేశ్ అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని ఎంఈఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.