స్కూల్స్ రీ ఓపెనింగ్‌పై రాష్ట్ర సర్కార్ ఇవాళ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. వైద్య శాఖ ఇచ్చిన రిపోర్టుపై విద్యాశాఖ అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా ప్రభుత్వం ఈ నెల 30 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలను ఓపెన్ చేసుకోవచ్చని వైద్యశాఖ రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రైమరీ స్కూల్స్ మినహాయించి మిగతా విద్యా సంస్థలను ఫిబ్రవరి 1 నుంచి ఓపెన్ చేసేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 8, 9, 10 తరగతులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నారు.
For More News..