కరోనా కేసులపై తెలంగాణ హెల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. రోజుకి 10 లక్షల కేసులు యూఎస్ లో నమోదు అవుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో 90 శాతం కేసులు ఒమిక్రాన్ ఉంటాయన్నారు డీహెచ్. ప్రస్తుతం డెల్టా50 శాతం, ఒమిక్రాన్ 50 శాతం కేసులు ఉన్నాయన్నారు. అవసరం అయితేనే ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోవాలని ప్రయివేట్ ఆస్పత్రులకు డీహెచ్ విజ్ఞప్తి చేశారు. ప్రోటోకాల్స్ పాటించాలన్నారు. కేద్రం మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. ఆక్సిజన్ అవసరం పెద్దగా రావడం లేదని ఆయన తెలిపారు. పేషంట్ కండీషన్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలని.. కాస్ట్లీ మందులు వాడొద్దని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు డీహెచ్ సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ కు కాక్ టెయిల్ వంటి ట్రీట్మెంట్ అవసరం లేదన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో అనుసరిస్తున్న చికిత్స విధానాల్ని అనుసరించాలన్నారు. మరోసారి అలా చేస్తే రిక్వెస్ట్ లు ఉండవు.. చర్యలు మాత్రమే ఉంటాయని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులను హెచ్చరించారు.
వచ్చే నాలుగు వారాల్లో కరోనా తారస్థాయిలో ఉంటుందన్నారు డీహెచ్. ఫిబ్రవరి మిడిల్ నుంచి కేసులు తగ్గుతాయన్నారు. ప్రతీ ఒకరు జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ‘మాస్క్ ధరించండి, గెదరింగ్స్ వద్దు, ఓపెన్ ప్లేస్ లో ఉండండి, భౌతిక దూరం పాటించండి, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఇంట్లో ఉండండి, వ్యాక్సిన్ వేయించుకోండి, వ్యాధి లక్షణాలు ఉంటే టెస్ట్ లు, స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లో ఉండండి, అవసరం అయితేనే హాస్పిటల్ కు వెళ్ళండి’ అంటూ ఆయన ప్రజలకు పలు సూచనలు కూడా చేశారు. 2 కోట్ల కరోనా కిట్స్, 1 కోటి మెడిషన్ కిట్స్ రెడీగా ఉన్నాయని తెలిపారు శ్రీనివాసరావు. 27 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య శాఖలో సెలవులు రద్దు చేశామన్నారు. వ్యాధి లక్షణలు పదిశాతం ఉన్న టెస్టు చేయించుకోవాలని కోరారు.
అలాగే అవసరం అయితే హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాలన్నారు డీహెచ్. 90 శాతం మందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే బయట పడుతున్నాయన్నారు. మరి కొందరిలో 3 రోజుల తరువాత లక్షణాలు తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. హాస్పిటల్ అవసరం లేకపోయినా... కొందరు ఇంకా హాస్పిటల్ కు పరుగులు పెడుతున్నారన్నరు. అలాంటి వారి వల్ల అవసరం ఉన్నవారికి బెడ్స్ దొరకని పరిస్థితి తలెత్తుతుందని డీహెచ్ పేర్కొన్నారు.15 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. నిన్న ఒక్క రోజే తెలంగాణలో 1550 కేసులు రికార్డ్ అయ్యాయన్నారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 979 కేసులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో కేసులు సుమారు 2 నుంచి 6 రేట్లు పెరిగాయన్నారు. నాలుగు రోజుల 4 రేట్లు కేసులు పెరిగాయని తెలిపారు. 1 నుంచి 3.5శాతం కు పాజిటివీటి రేట్ పెరిగిందన్నారు. దీంతో పాటు పండుగల వేళ జగ్రత్తగా ఉండలన్నారు.ర్యాలీలు సభలు నిర్వహించవద్దని రాజకీయ నాయకులకు డీహెచ్ విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీలు .. పొలిటికల్ యాక్టివిటీలు ఆపాలన్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రేమించి పెళ్లాడి.. నల్లగా ఉందని వద్దన్నాడు
కలకలం రేపిన పావురం !