= ఫైల్ కొట్టేయకుండా కేబినెట్ కు తిప్పి పంపాల్సింది
= కోదండరాం, అమిర్ అలీఖాన్ ను నియమిస్తూ జారీ చేసిన గెజిట్ ను కొట్టేసిన కోర్టు
= దాసోజు, కుర్ర కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనం
హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్‌నియమిస్తూ జారీ చేసిన గెజిట్ ను కొట్టి వేసింది. ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం కీలక అంశాలను ప్రస్తావించింది. వీరి నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని ధర్మాసనం సూచించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తూ అప్పటి కేబినెట్ గవర్నర్ కు పంపింది. దీనిని గవర్నర్ తమిళిసై తిరస్కరించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. వాటిని తిరస్కరించకుండా కేబినెట్ కు తప్పి పంపాల్సిందని అని పేర్కొంది.
ALSO READ :- UPSC Recruitment: EPFOలో పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్.. దరఖాస్తు చేసుకోండిలా..
ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాదులు తీసుకెళ్లారు. మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్ కట్టుబడి ఉండాల్సిదేనని హైకోర్టు సూచించింది. అభ్యంతరాలు ఉంటే కేబినెట్ కు తిప్పి పంపాలని, తిరస్కరించరాదని హైకోర్టు సూచించింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎన్నిక అంశాన్ని పున: పరిశీలించాలని గవర్నర్ కు సూచించింది. దీనిపై గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.