TSPSC పేపర్ లీకేజీ కేసు ఎప్పట్లోగా పూర్తి చేస్తారు సిట్ ను నేరుగా ప్రశ్నించిన హైకోర్టు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఏసీపీ నర్సింగ్ రావు హై కోర్టకు నేరుగా  హాజరయ్యారు. ఎప్పటిలోపు దర్యాప్తు పూర్తి చేస్తారని సిట్ ను  హై కోర్టు ప్రశ్నించింది. పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ గ్రూప్ 1 రాసేందుకు కమిషన్ అనుమతి పొంది NOC  తీసుకున్నాడని హైకోర్టు కు తెలిపాడు. ఈ సందర్బంగా సిట్ సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు..సిట్ దర్యాప్తు నిదానంగా ఉందని అనిపిస్తుందని వ్యాఖ్యానించింది. 

టీఎస్పీఎస్సీ కేసులో సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి రిపోర్ట్  రావాల్సి ఉందని ప్రభుత్వ తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.  ఈ కేసులో టీఎస్పీఎస్సీ లో ఉన్న అవుట్ సోర్సింగ్  సిబ్బంది అందరిని విచారిచారా అని హైకోర్టు ప్రశ్నించింది.  టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో  ఏ- 16 ప్రశాంత్ రోల్ ఏంటీ  అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రశాంత్ రాజశేఖర్ బావ అని..అతను  న్యూజీలాండ్ నుంచి వచ్చి పరీక్ష రాసి వెళ్ళాడని  ప్రభుత్వ న్యాయవాది తెలిపాడు.  డబ్బులు పెట్టి పేపర్ కొన్న వాళ్ళు మళ్ళీ ఎవరికైనా అమ్మారా అని  హై కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో తదుపరి విచారణ  జూన్ 5 కు వాయిదా వేసింది.