
తెలంగాణ రాష్ట్రంలో హైయర్ ఎడ్యూకేషన్ నుంచి ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్-2024 నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాకతీయ యూనివర్సిటీ పరీక్ష నిర్వహిస్తుంది. మార్చి 7 నుంచి ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 30 వరకు, రూ.250 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 27 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ కోర్సులు ఉద్యోగాల కల్పన కూడా అధికంగానే ఉంటాయి. మార్కెటింగ్, బిజినెస్, ఐటీ సెక్టార్ లో స్కిల్స్ ఉంటే జాబ్స్ కు కొదువ లేదు. అభ్యర్థులకు జూన్ 4, 5 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. 200 మార్కులతో 200 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.