
వరంగల్: తెలంగాణ ఐసెట్- 2020 ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్ లోని కాకతీయ వర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేశారు. సెప్టెంబర్ 30, అక్టోంబర్ 1న నిర్వహించిన టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షకు 45,975మంది హాజరు కాగా, 41,506 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఉత్తీర్ణత 90.28 శాతం నమోదైందని తెలిపారు పాపిరెడ్డి.