తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపులకు ఇంటర్ బోర్డు తేదీలను ఖరారు చేసింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు మార్చి- 2025కు సంబంధించిన పరీక్ష ఫీజు షెడ్యూల్, ఫీజు వివరాలను బోర్డు విడుదల చేసింది.
- విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 06 నుంచి నవంబర్ 26 తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
- రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 04 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
- రూ. 500 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 05 నుంచి డిసెంబర్ 11 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
- రూ. 1,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 18 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
- రూ.2,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 27 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
ఫీజు చెల్లింపుల వివరాలు
- ఫస్టియర్- జనరల్ రెగ్యులర్: రూ. 520
- ఫస్టియర్- ఒకేషనల్ రెగ్యులర్: రూ. 750
- సెకండియర్- జనరల్ కోర్సెస్ (జనరల్ ఆర్ట్స్: రూ. 520, జనరల్ సైన్స్: రూ. 750)
- సెకండియర్- ఒకేషనల్ రెగ్యులర్: రూ. 750