
- వెబ్సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు
- త్వరలో స్టూడెంట్ల మొబైల్స్ కూ డౌన్లోడ్ లింకులు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ హాల్ టికెట్లను విడుదల చేసినట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. కాలేజీల లాగిన్‌లలో హాల్ టికెట్లు అప్‌లోడ్ చేసినట్లు ఒక ప్రకటనలో చెప్పారు. హాల్ టికెట్లలో ఏమైన తప్పులుంటే వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్స్ ను సంప్రదించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు 9.5 లక్షల మంది అటెండ్ కానున్నారు. అయితే, విద్యార్థులకు క్యూఆర్ కోడ్ సహాయంతో వారి పరీక్షా కేంద్రాలకు చేరుకునే సమాచారం హాల్ టికెట్లపై ప్రింట్ చేసినట్టు చెప్పారు. అతి త్వరలోనే విద్యార్థుల మొబైల్ నెంబర్లకు హాల్ టికెట్లకు డౌన్ లోడ్ లింకును పంపించినట్టు తెలిపారు.
నేటి నుంచి ఎంసెట్ దరఖాస్తులు..
ఈఏపీ సెట్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానున్నది. ఈనెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకూ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 6,7,8 తేదీల్లో దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చని సూచించారు. రూ.250 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకూ అప్లై చేయొచ్చని వెల్లడించారు. కాగా, ఏప్రిల్ 29 నుంచి ఎప్ సెట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.